
బటర్ చికెన్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… అది సరిగా వస్తుందో లేదో, తీరా చేశాక బాగోదేమో అని రకరకాల డౌట్లు వస్తుంటాయి. కొంతమందైతే… అది చెయ్యాలంటే చాలా టైమ్ పడుతుందేమో అనుకుంటారు. అలాంటి డౌట్లేమీ అక్కర్లేదు. అత్యంత ఈజీగా, వేగంగా, అదిరే టేస్టుతో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
AlsoRead: మొక్కజొన్న పులావ్ …మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్ట్
కావాల్సిన పదార్ధాలు
చికెన్ – పావుకేజీ (250గ్రాములు) (బోన్ లెస్)
– ఉప్పు – సరిపడా.
– మిరియాలపొడి – అర టీ స్పూన్
– కారం – 2 టీస్పూన్లు
– పసుపు – 1 1/2 టీస్పూన్ (ఒకటిన్నర టీ స్పూన్)- బటర్ – 6 టేబుల్ స్పూన్లు
– ఉల్లి – 1 1/2 కప్పు (ఒకటిన్నర కప్పు) (కట్ చేసి పెట్టుకోండి)
– గరం మసాలా – 3 టీస్పూన్లు
– అల్లం – 1 టేబుల్ స్పూన్ (నూరి పెట్టుకోవాలి)
– లవంగాలు – 3 (పొడి చేసుకోవాలి)
– దాల్చిన చెక్క – ఒక పెద్ద ముక్క (పొడి అయినా ఓకే)
– టమాటాలు – 350 గ్రాములు (మిక్సీలో వేసి… సాస్‌లా చేసుకోండి)
– హెవీ క్రీమ్ – 1 కప్పు (Heavy Cream అని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. చిక్కటి పాలు)
Also Read: మష్రుమ్ మసాలా కర్రీ
బటర్ చికెన్ తయారీ విధానం :
– ముందుగా చికెన్‌ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
– ఇప్పుడు ఆ ముక్కలపై సరిపడా ఉప్పు చల్లాలి.
– ఇప్పుడు మిరియాల పొడిని పావు టీ స్పూన్ చల్లాలి.
– ఇప్పుడు 1 టీస్పూన్ కారం చల్లాలి.
– నెక్ట్స్ పసుపు వెయ్యండి.
– వేసినవి అన్ని ముక్కలకూ చేరేలా చేత్తో కలపండి.
– ఇప్పుడు ప్యాన్ లేదా బాణలి లేదా కడాయ్‌లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వెయ్యండి.
– బటర్ కాస్త వేగిన తర్వాత… చిన్నగా బుడగలు వస్తున్నప్పుడు… చికెన్ ముక్కల్ని వెయ్యండి. బాగా కలపండి. ముక్కలపై నుంచీ బటర్ అలా అలా జారుతూ ప్యాన్‌లో పడాలి.
– కాసేపటికి… ముక్కలు ఫ్రై అయిపోతాయి. వెన్నను ముక్కలు పీల్చేసుకుంటాయి. అప్పుడు ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకోండి.
– ఇప్పుడు మళ్లీ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల బటర్ వెయ్యండి.
– అది వేగి, బుడగలు వస్తున్నప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వెయ్యండి.
– వెంటనే 3 టీ స్పూన్ల గరం మసాలా వెయ్యండి.
– వెంటనే 1 టీ స్పూన్ కారం వెయ్యండి.
– వెంటనే 1 టీ స్పూన్ పసుపు వెయ్యండి.
– అప్పుడే అల్లం ముద్ద వెయ్యాలి.
– అదే ఊపులో లవంగాల పొడి వెయ్యాలి.
– దాల్చిన చెక్క ముక్క వెయ్యాలి. (పొడి అయితే ఓ టీస్పూన్ కంటే తక్కువే వేసుకోండి)
– ఇప్పుడు కొద్దిగా ఉప్పు వెయ్యండి.
– ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వెయ్యండి.
– ఇప్పుడు బాగా తిప్పండి… మొత్తం ఫ్రై అయిన ఫీల్ కలగాలి. అప్పటివరకూ తిప్పండి. దాదాపు వెన్న మొత్తం అయిపోయిందే అన్నట్లు కనిపించాలి.
– ఇదే సమయంలో… ఆలస్యం చెయ్యకుండా… టమాటా జ్యూస్ లేదా రసం 350 గ్రాములు వేసేయండి.
– బాగా కలపండి.
– కలిపిన వెంటనే ఓ కప్పు నీరు పొయ్యండి.
– వెంటనే హెవీ క్రీమ్ 1 కప్పు వెయ్యండి.
– బాగా కలపండి.
– రెండు నిమిషాల తర్వాత… చికెన్ ముక్కలు వెయ్యండి.
– బాగా కలపండి.
– మూత పెట్టి… 10-15 నిమిషాలపాటూ సిమ్‌లో ఉడికించండి.
– ఆ తర్వాత మూత తీసి… బాగా కలపండి.
– ఇప్పుడు బటర్ 2 టేబుల్ స్పూన్లు వెయ్యండి.
– బాగా కలపండి… అలా కలుపుతున్నప్పుడు… బటర్ ముక్క ఆటోమేటిక్‌గా కరిగిపోయి… మొత్తం స్ప్రెడ్ అవుతుంది.
– అంతే… బటర్ చికెన్ రెడీ. ఇప్పుడు దాన్ని బిర్యానీ రైస్‌లో లేదా… బాస్మతీ రైస్ వంటి వాటిలో వేసుకొని తింటే… ఇక పండగే. ఇంకెందుకాలస్యం… ఈ సండే ఇది ట్రై చెయ్యండి.
Also Read: పచ్చి మామిడి తో రొయ్యల కూర …