
Healthy Diet : రోజూ రెండు పండ్లు, మూడు కూరగాయలతో భోజనం ముగిస్తే మరణాల ముప్పు తగ్గుతుందని దీర్ఘాయువు సొంతమవుతుందని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన అథ్యయన వివరాలను అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వెల్లడించింది. ఆరోగ్యంగా దీర్ఘకాలం బతకాలంటే మాంసం, చేపలు వంటి అధిక కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే అతితక్కువ ఖర్చుతో కేవలం పండ్లు, కూరగాయలతో ఆరోగ్యంగా పదికాలాల పాటు జీవించవచ్చని హార్వర్డ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది.
రెండు పండ్లు, మూడు కూరగాయలతో భోజనం ముగిస్తే మరణాల ముప్పు తగ్గుతుందని దీర్ఘాయువు సొంతమవుతుందని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన అథ్యయన వివరాలను అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వెల్లడించింది. అంతకుమించి ఆహారం తీసుకున్నా అదనపు ప్రయోజనాలు ఏమీ ఉండవని తేల్చిచెప్పింది. తాము సూచించిన ఈ ఆహారం ప్రజలందరూ తక్కువ ఖర్చుతో తీసుకోదగినదని, దీని ద్వారా తీవ్ర వ్యాధులు దరిచేరకుండా చూసుకోవడంతో పాటు అధిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని అథ్యయన రచయిత, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఫ్యాకల్టీ డాక్టర్ డాంగ్ డీ వాంగ్ స్పష్టం చేశారు.
అయితే అన్ని పండ్లూ, కూరగాయలు ఒకే తరహా ఫలితాలు ఇవ్వవని డాక్టర్ వాంగ్ పేర్కొన్నారు. అన్ని రకాల ఆకుకూరలు, బీటా కెరోటీన్ కలిగి ఉండే కూరగాయలు, జామ, ఉసిరి వంటి సిట్రస్ జాతి పండ్లు, బెర్రీస్ వంటివి ఆరోగ్యానికి మేలు చేసి దీర్ఘాయువును ప్రసాదిస్తాయని వెల్లడైందని అన్నారు. ఇక వేరు శనగ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, పండ్ల రసాలు వంటివి తీవ్ర వ్యాధుల బారినపడకుండా, మరణాల ముప్పు నుంచి ప్రజల్ని కాపాడలేవని తమ అథ్యయనంలో వెల్లడైందని చెప్పారు.
Also Read : పిల్లల్లో కరోనా వైరస్ … కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు