
పసుపు మంచి యాంటీఆక్సిడెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. అందుకే.. ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే పసుపు రాసి ప్రథమ చికిత్స చేసేస్తాం. తాజా పరిశోధనలో పసుపులోని మరో సుగుణం కూడా బయటపడింది. పసుపు శరీరానికి రక్షణ కవచంగా ఉండటమే కాకుండా మన మెమరీ పవర్‌ను కూడా పెంచుతుందడట. అదేనండి ‘జ్ఞాపకశక్తి’ని పెంపొందిస్తుందట. ఈ పరిశోధనలో పసుపు గురించి పరిశోధకులు ఇంకా ఏమేమి ఆసక్తికర విషయాలు చెప్పారో చూసేద్దామా!
Also Read: మీరు రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఏం నష్టపోతున్నారో తెలుసా !
పసుపు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొనేందుకు.. మతిమరుపుతో బాధపడుతున్న 50 నుంచి 90 ఏళ్ల వయస్సులో ఉన్న 40 మంది వ్యక్తులపై పరిశోధనలు చేశారు. వీరికి పసుపును రోజుకు 2 సార్లు 90 మిల్లి గ్రాముల చొప్పున ఆహారంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీరికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. 18 నెలల తర్వాత వీరిలో మెమరీ పవర్‌లో అద్భుతమైన మార్పు కనిపించింది.
జ్ఞాపకశక్తి పెంపొందిస్తుంది: పసుపును తీసుకున్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి, విషయ సంగ్రహణ 28 శాతానికి పెరిగినట్లు తెలుసుకున్నారు. వీరు ఆహారంగా తీసుకున్న పసుపు రక్తంలో కలిసి మెదడుకు చేరి, అల్జిమర్స్‌ను నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. 18 నెలల తర్వాత వీరంతా గతంలో కంటే చురుగ్గా ఉన్నారని తెలిపారు. పైగా.. ఈ వైరస్ సీజన్‌లో పసుపును ఆహారంగా తీసుకోవడం పరిపాటిగా మారింది. కాబట్టి.. పసుపును నిర్లక్ష్యం చేయకండి.