
Vitamin B12 : విటమిన్ బి 12 శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు అవసరమైన ఒక పోషకం. దీని సహజ ఉత్పత్తి శరీరానికి సహాయపడదు కాబట్టి ఆహారం మరియు మందుల ద్వారా శరీరానికి అందించాలి . ముఖ్యం గా గర్భిణీ స్త్రీలు కు విటమిన్ బి 12 (Vitamin B12)చాల అవసరం , ఎందుకంటే దాని లోపం శిశువులో పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. Also Read : చేపల పులుసు తింటే డిప్రెషన్ పరార్ !
విటమిన్ బి 12 ప్రాధాన్యత:
మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది.
విటమిన్ లెవల్స్ ను తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తెలుస్తుంది. విటమిన్ బి12 (Vitamin B12)లోపం ఉన్నవారు జీవశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి . డైట్ లో మార్పులు చేసుకొన్న తర్వాత మార్పులు లేకుంటే డాక్టర్ ను కలిసి, విటమిన్ డి12 వైద్యపరమైన కారణాలను తెలుసుకోవాలి .
విటమిన్ బి12 ఫుడ్స్
చేపలు : అనిమల్ ప్రొడక్ట్స్ లో అధికంగా విటమిన్ బి12లో కనుగొనడం జరిగింది . స్మోక్డ్ సాల్మన్, హెయరింగ్స్, తున, ట్రౌట్, మరియు క్యాన్డ్ సార్డిన్స్ వంటి ఆహారాల్లో విటమిన్ బి12(Vitamin B12) ఎక్కువగా ఉంటుంది.
గుడ్డు: గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా పచ్చసొనలో, కొద్దిగా ఎగ్ వైట్ లో ఉంటుంది. ఒక ఉడికించిన గుడ్డులో 0.7mcg విటమిన్ బి12 ఉంటుంది.
పాలు మరియు పెరుగు: ఫుల్ ఫ్యాట్ మిల్క్ విటమిన్ బి12 కు ఒక మంచి ఆప్షన్ . ఇంకా మీరు పెరుగును కూడా ఎంపిక చేసుకోవచ్చు . మీరు వెజిటేరియన్స్ అయితే మాంసాహారాలకు ఇవి మంచి ప్రత్యామ్నాయ ఆహారాలు .
సోయా ప్రొడక్ట్స్: సోయా ప్రొడక్ట్స్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. మీరు సోయా మిల్క్ ను కూడా ప్రయత్నించవచ్చు . విటమిన్ బి12కు ఇది మరో ప్రత్యామ్నాయం.
Also Read : పిల్లలా ఫుడ్ మెనూలో ఇవి ఉండాల్సిందే…