
Bread Roll Recipe : బ్రెడ్ రోల్ అనేది బ్రెడ్ స్లైస్‌లలో మసాలా బంగాళాదుంపలను నింపడం ద్వారా తయారు చేయబడిన మంచి పార్టీ స్నాక్.
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లయిసెస్: 8,
ఆలుగడ్డలు: 2 (మధ్య రకానివి),
ఉల్లిగడ్డ: ఒకటి,
పచ్చిమిర్చి: నాలుగు,
కొత్తిమీర తురుము: ఒక టేబుల్ స్పూన్,
కారం: ఒక టీస్పూన్,
ఉప్పు: తగినంత,
ధనియాల పొడి: ఒక టీస్పూన్,
నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టి పొట్టు తీసుకోవాలి. ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. బ్రెడ్ స్లయిసుల అంచులు తీసేసి నీటిలో ముంచి అరచేతిలో వేసుకుని నీరు పోయేలా ఒత్తి, మధ్యలో ఆలుగడ్డ మిశ్రమం ముద్దపెట్టి అంచులు మూసి బుల్లెట్లలా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక చేసి పెట్టుకున్న రోల్స్ వేసి దోరగా వేయించుకుంటే బ్రెడ్ రోల్స్ రెడీ. టమాట సాస్, గ్రీన్ చట్నీ వీటికి చక్కని జోడీ.