Ghee For Skin Health

Ghee :  పురాతన కాలం నుండి, నెయ్యి యొక్క ప్రాముఖ్యతను భారతీయ సంస్కృతిలో తగినంతగా నొక్కి చెప్పలేము. సాంప్రదాయకంగా, స్వచ్ఛమైన నెయ్యి(Ghee )ఆవు పాలు నుండి తయారవుతుంది. ఇది శక్తి వంతమైన ఆహారంగా పరిగణించబడుతుంది. నెయ్యి లో మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది మరియు నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు శరీరానికి వైద్యం చేసే ఏజెంట్లుగా పనిచేస్తాయి.నెయ్యి ఆరోగ్యానికే కాక అందాన్ని పెంచటం లో కూడా ఉపయోగపడుతుంది అయితే నెయ్యితో కలిగే బ్యూటీ బెనిఫిట్స్‌ గురించి తెలుసుకోండి .  Also Read : వర్ష కాలంలో ఆరోగ్యవంతమైన చర్మ సంరక్షణకు చిట్కాలు

పొడి చర్మం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సీజన్‌తో సంబంధం లేకుండా డ్రై స్కిన్‌తో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వాళ్లు కొన్ని చుక్కల నెయ్యిని చర్మంపై రాసుకుని కాసేపు సాజ్‌ చేసి వదిలేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల పొడి చర్మం సమస్య దూరమవుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.

నెయ్యిని ఆహారంతోపాటు తీసుకుంటే చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్‌-ఇ వయసు పైబడిన లక్షణాలను దరిచేరకుండా చూస్తుంది. అంతేకాదు చర్మం ముడతలు పడకుండా ఉండడంలోనూ నెయ్యి(Ghee )తోడ్పడుతుంది.

బాత్‌ ఆయిల్‌గానూ నెయ్యిని(Ghee )ఉపయోగించవచ్చు. 5 టేబుల్‌స్పూన్ల నెయ్యి తీసుకుని అందులో పది చుక్కలు మీకిష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొన్ని చుక్కలు స్నానం చేసిన తరువాత ఒంటికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

కళ్లు అలసటగా ఉంటే కొన్ని చుక్కల నెయ్యిని కళ్ల చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్‌ చేస్తే ఉపశమనం లభిస్తుంది. నెయ్యిని పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.

సూచన : ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.

Also Read : చల్లటి నీరు vs వేడి నీరు : స్నానానికి ఏ నీళ్లు బెట‌ర్ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *