carrot chutney recipe

క్యారెట్ జ్యూస్, క్యారెట్ హల్వా వంటివి మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు మనం స్పైసీ క్యారెట్ చెట్నీ తయారు చేద్దాం. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం మరియు చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు.ఈ చెట్నీలో విటమిన్ A ఉంటుంది. అది మన కళ్లు, స్కిన్‌కి మేలు చేస్తుంది. అన్నింటికీ మించి ఈ చెట్నీ టేస్ట్ అదిరిపోతుంది.

Also Read: ఆహా అనిపించే మటన్ ఖీమా

Carrot Chutney | How to make carrot chutney | Carrot Pachadi

కావాల్సినవి: 2 క్యారెట్లు (చిన్నగా కట్ చేసి పెట్టుకోండి), ఓ ఉల్లిపాయ (కట్ చేసి పెట్టుకోండి), 2 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 లేదా 3 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు, 2 టీస్పూన్ల నూనె, పావు టీస్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకులు.

Carrot Chutney - How to make tasty Carrot Chutney for idli, dosa ...

తయారీవిధానం: ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి… వేడెక్కాక… మినప్పప్పు వెయ్యండి, వెంటనే ఎండుమిర్చి, చింతపండు వేసి కలుపుతూనే ఉండండి. మంట సిమ్‌లో ఉండాలి. మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ అవుతున్నప్పుడు మొత్తం ప్యాన్ నుంచి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో పై తొక్కలు తీసేసిన చిన్న ఉల్లిపాయలు వెయ్యండి. వెల్లుల్లి రెబ్బలు కూడా. సిమ్‌లో వండండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక… వాటిని పక్కన పెట్టండి.ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని చిన్న మంటలో 5 నిమిషాలు వేపండి. ఆ తర్వాత అన్నీ మిక్సీలో వేసి ఆడించండి. ఉప్పు కూడా వెయ్యండి. గ్రైండ్ అయ్యేటప్పుడు సరిగా అవ్వకపోతే.. కొద్దిగా నీరు పోసి మళ్లీ గ్రైండ్ చెయ్యండి. ఇప్పుడు వేపిన ఆవాలు, కరివేపాకు వేశారంటే… స్పైసీ క్యారెట్ చెట్నీ రెడీ .