ముడి మామిడి లేదా పచ్చి మామిడి కాయతో చేసే ఈ రుచికరమైన రైస్ రెసిపీ, అందరూ మెచ్చేలా మాత్రమే కాకుండా, ఉదయం బ్రేక్ఫాస్ట్ లా కూడా తీసుకోవచ్చు. చిత్రాన్నం అనేది కర్ణాటక, దక్షిణ భారతదేశపు రుచికరమైన, సాంప్రదాయక వంటకంగా అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇంట్లో అన్నం మిగిలిపోతే, సైడ్ డిష్లా ఈ రెసిపీ చేస్తుంటారు.
- తయారుచేయు విధానం :
- ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి.
- ఆవాలు చిటపలాడిన తరవ్ాత అందులో శెనగపప్పు, ఉద్దిబాళ్ళు, వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వెంటవెంటనే అందులో పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు మరియు ఇంగువ వేసి, కొన్ని సెకండ్లు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
- పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమామిడి తురుము వేసి మరోకొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులోనే రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నంను పోపులో వేసి, ఉప్పు చిలకరించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో తెలుకొని సరిపడా వేసి మిక్స్ చేసి అడ్జెస్ట్ చేసుకోవాలి.
- అంతే మామిడికాయ పులిహోర రెడీ. ఉగాది స్పెషల్ గా మామిడికాయ పులిహోరతో పాటు సైడ్ గా వడియాలు, పెరుగు లేదా పచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.