rajasekhar health condition

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కరోనా నుంచి కోలుకున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. దీంతో ఆయన అభిమానులు రాజశేఖర్ ఆరోగ్యంపై అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్స్‌ను.. వీలున్నప్పుడల్లా రాజశేఖర్ సతీమణి జీవిత ఆరోగ్య సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. అందులో భాగంగా తాజాగా జీవిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ..  రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలియజేశారు. రాజశేఖర్‌కు కరోనా వైరస్‌ వల్ల శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్‌ కొంత తగ్గిందని.. పలు పరీక్షల అనంతరం ఆయనను ఐసీయూ నుంచి కొన్ని రోజుల్లో డిశ్చార్జ్‌ చేయనున్నారని ఆమె తెలిపింది. రాజశేఖర్ చికిత్స తీసుకుంటున్న సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు రాజశేఖర్‌కు సరైన చికిత్స అందిస్తున్నారని తెలిపింది.

Also Read: హీరోగా ఎంట్రీ ఇస్తున్నయాంకర్ సుమ తనయుడు..

 

ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం - Tollywood hero Rajasekhar health in  critical condition

 

మొదట్లో రాజశేఖర్ ఆరోగ్యం కొంత క్రిటికల్‌గానే ఉండేదని.. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపింది. అయితే కొన్ని మీడియా సంస్ధలు మాత్రం రాజశేఖర్ వెంటిలేటర్‌పై ఉన్నాడని రాస్తున్నారని.. అది నిజం కాదని పేర్కోంది. అయితే జీవిత నుంచి ఈ మాటలు రావడంతో ఆయన అభిమానుల‌లో కొంత ఆందోళ‌న త‌గ్గింది. ఇక రాజశేఖర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన 2017లో గరుడవేగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. ఆయన ప్రస్తుతం అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *