Meena

Meena : సీనియర్ హీరోయిన్స్ లలో ఇండస్ట్రీలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న నటిమణుల్లో మీనా ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో కుర్రాళ్ళు ఎగబడి చూసేవారు. ఆమె షూటింగ్ కోసం ఎక్కడికైనా వచ్చిందని తెలిస్తే లొకేషన్ మొత్తం జనసంద్రంగా ఉండేది.2003 వరకు 13ఏళ్ళు హీరోయిన్ గా అగ్ర స్థానాన్ని చూసింది. కొన్నిసార్లు ఒక్క ఏడాదిలోనే 8 సినిమాలతో వచ్చి అప్పటి స్టార్స్ కు గట్టి పోటీని ఇచ్చింది. మీన గ్లామర్ రోల్స్ తో అంతగా మెప్పించలేదు అని విమర్శలు చేసిన వారికి కూడా కౌంటర్ ఇచ్చేలా గ్లామర్ పాత్రల్లో నటించింది.

Meena

 

ప్రస్తుతం కూడా దృశ్యం లాంటి సినిమాల్లో మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. అయితే మీన 20 ఏళ్ళ వయసులో ఎలా ఉందొ ఇప్పటికి కూడా అలానే ఉందని ఆమె ఫొటోలు చూస్తేనే అర్ధమవుతోంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటో నెటిజన్లను బాగా ఎట్రాక్ట్ చేసింది. 44 ఏళ్ళ వయసులో కూడా చంపేస్తున్నారు అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మీన తెలుగు దృశ్యం 2లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Meena

ఇక 2009లో విద్యాసాగర్ అనే వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీన గ్లామర్ రోల్స్ చేయడం తగ్గించేసింది. కేవలం తనకు నచ్చిన సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తోంది. ఇక 2011లో మీనకు పాప పుట్టింది. ఆమె పేరు నైనిక. మీనకు 10ఏళ్ల కూతురు కూడా ఉందని అంటే ఎవరు నమ్మరు. నైనిక కూడా అప్పుడప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపిస్తోంది.

Also Read : ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *