shraddha das

Shraddha Das  : శ్రద్దా దాస్ పలు హిట్‌ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్‌ డోస్‌ పెంచినా ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో సరైన గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ బ్యూటీ. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ గ్లామరస్‌ ఫోటోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది ఈ భామ.

shraddha das - telugudunia

తాజాగా సిగరెట్‌ కాలుస్తున్న ఓ ఫోటోను షేర్‌ చేస్తూ..నాకు సిగరెట్‌ తాగడం నచ్చదు. కానీ నటిగా మారినప్పుడు అన్నీ చేయాల్సిందే నచ్చకపోయినా సరే అంటూ సినిమా సెట్‌లోని ఈ ఫోటోను షేర్‌ చేసింది. కాగా ఇది నిజం సిగరెట్‌ యేనా లేదా డమ్మీదా అని నెటిజన్లు ప్రశ్నించగా..లేదు లేదు. ఇది నిజం సిగరెటే అని సమాధానమిచ్చింది. ఇక పొగతాడం ఆరోగ్యానికి హానికారం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అర్ధం, నిరీక్షణ ,కన్నడలో కోటిగొబ్బ వంటి సినిమాలు చేస్తోంది.

Also Read : ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *