Surekha Vani Dance

Surekha Vani : పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది సురేఖా వాణి. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ని అమాంతం పెంచేసుకుంటూ ఆన్ లైన్ వేదికలపై రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితను కూడా సెలబ్రిటీ చేసేసింది సురేఖ. సినిమాలేవీ చేయకపోయినా సుప్రితను అనుసరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇక ఈ తల్లీకూతుళ్ళ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు.

కూతురుతో కలిసి సురేఖా వాణి స్టెప్ వేసిందంటే ఆన్ లైన్ వేదికలు షేక్ కావాల్సిందే. ఇప్పటికే ఎన్నోసార్లు అలా సోషల్ మీడియాలో హంగామా చేశారు ఈ ఇద్దరూ. ఈ క్రమంలోనే తాజాగా మరో మాస్ డాన్స్‌తో ఇరగదీశారు. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత సారీ కట్టి పిచ్చెక్కించే తీన్మార్ స్టెప్పులేసింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. తల్లీకూతుళ్ళ మాస్ డాన్స్, ఎనర్జీ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు.

భర్త సురేష్ తేజ మరణించిన తర్వాత కూతురు సుప్రితతో కలిసి ఒంటరిగానే ఉంటోంది సురేఖా వాణి. మొన్నామధ్య ఈమె రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఖండించింది సురేఖ. అలాగే సుప్రిత కూడా తన తల్లి రెండో పెళ్లి వార్తలపై కాస్త సీరియస్ అయింది.

Also Read : మునుపెన్నడూ లేనంత బోల్డ్ గా సమంత …షాక్ అవ్వడం ఖాయం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *