Adah Sharma

నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు అదా శర్మ…ఆ తరవాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘గరం’, ‘క్షణం’ చిత్రాల్లో నటించారు. వరుసపెట్టి సినిమాలు చేసినా తెలుగులో స్టార్ డమ్ సంపాదించలేకపోయారు అదా.ఇదిలా ఉంటే, అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అందుకే, వాళ్లను ఆకట్టుకోవడానికి అదా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, న్యూ ఫ్యాషన్‌ను ఆమె బాగా ఫాలో అవుతూ ఉంటారు. జుట్టుకు రకరకాల రంగులు, వెరైటీ దుస్తులు ఇలా ప్రత్యేక చూపిస్తూ ఉంటారు.

Also Read: సమంత బికినీ లుక్ పై శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే, తాజాగా అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ ఫొటోల్లో ప్రత్యేకత ఏంటంటే.. అదా బ్లౌజ్ వేసుకోకుండా పరిమళాలు వెదజిమ్మే విరాజాజి పూలతో ఎద అందాలను కప్పారు. ఈ ఫ్లవర్ కాస్ట్యూమ్‌తో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు కూడా ఇలాంటి పూల కాస్ట్యూమ్ ఒకటి ధరించారు అదా. అది మరింత విడ్డూరంగా ఉంది. చిన్న చిన్న తెల్ల పూలతో కూడిన కొమ్మలను ఎద అందాలకు అడ్డంగా ఉంచారు. ఆ ఫొటోలో బ్లూ, బ్లాక్ మిక్స్ హెయిర్‌తో అదా కనిపించారు.

Also Read: ప్రేమలో విఫలమైతే ఆ బాధేంటో నాకు తెలుసు : : రేణూ దేశాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *