Coronavirus movie in theaters

అన్ లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.దాంతో అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. దీంతో నిబంధనలకు తగ్గట్టు థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడానికి స న్నాహకాలు ప్రారంభించారు. అయితే ముందుగా ఏ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు అని సినీ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే నేనే ముందు వస్తున్నా అంటూ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాని రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడం విశేషం. కరోనా లాక్ డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలు తీసి వాటిని ఏటీటీల ద్వారా రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించాడు వర్మ. అదే సమయంలో ‘కరోనా వైరస్’ అనే సినిమా రూపొందించాడు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. వర్మ క్రియేట్ చేసిన ‘కరోనా వైరస్’ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలతో పాటు  ‘దేవుడా నీకో దండం రా’ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

కరోనా వైరస్ తో క్లోజ్ అయిన థియేటర్స్.. కరోనా వైరస్ మూవీతో స్టార్ట్