Crrush First Peep

తొలి సినిమా ‘అల్లరి’ నుంచి ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంటారు రవిబాబు . ఇటీవల ‘అదుగో’ అంటూ పంది పిల్లతో తీసిన ప్రయోగాత్మక చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ‘ఆవిరి’ అంటూ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినా ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఆయన రూటు మార్చారు. ప్రస్తుతం అడల్ట్ కంటెంట్‌తో ‘క్రష్’ అనే సినిమాను తీశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

Also Read: వరుస సినిమాలతో అదరగొడుతున్న ప్రియమణి..

ఈ ట్రైలర్‌లో ముగ్గురు యువకులను రవిబాబు ఇంటర్వ్యూ చేస్తుండగా… వారు తమ గర్ల్‌ఫ్రెండ్స్ గురించి, వాళ్లతో శృంగార అనుభవాల గురించి వివరిస్తూ ఉంటారు. ముగ్గురు హీరోయిన్లు అందాల ఆరబోతలో పోటీ పడ్డారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను టార్గెట్ చేసుకుని తీసినట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవిబాబు ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. ఈ సినిమాను ప్లైయింగ్ ఫాగ్స్ పతాకంపై రవిబాబు స్వయంగా నిర్మిస్తున్నారు.