eesha rebba to play boxer role

అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ ఈషా రెబ్బా. ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో మంచి పాత్రల తో ఆకట్టుకుంది .అయితే ప్రస్తుతం ఈషారెబ్బా బాక్సర్‌గా కనిపించనుంది. ఇందుకోసం మానసికంగా, శారీరకంగా ఆ పాత్రలో లీనమవడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపింది. ఇదే కాకుండా జిమ్నాస్టిక్స్‌లోనూ తర్పీదు పొందుతున్నానని చెప్పింది. నిజమైన బాక్సర్‌లా తెరపై చెలరేగడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చింది.

Also Read: అవికా గోర్ అదిరిపోయే అందాలు..

లాక్‌డౌన్‌ తనకు క్రమశిక్షణ నేర్పించిందని తెలిపింది. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ఈషా రెబ్బా.. సరికొత్త పాత్రలను ఎంచుకుంటోంది. తాజాగా బాక్సర్‌గా అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నానని వెల్లడించింది.ఇకపోతే.. కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో సంపత్‌ నంది వెబ్ సిరీస్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడట. ఈషారెబ్బ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ సినిమా రాత్రివేళ హైదరాబాద్‌ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈషా రెబ్బ ప్రస్తుతం హిందీలో సూపర్‌హిట్‌ చిత్రం ”లస్ట్‌ స్టోరీస్”‌ రీమేక్‌ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది.

Also Read: విలన్‌ పాత్రలకు సై … నివేదా థామస్