HBDPawalaKalyan

ఈరోజు నటుడు పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయ్యాడు. ఆ తర్వాత సుస్వాగతం, తమ్ముడు, తొలిప్రేమ సినిమాలతో యూత్ ను తనవైపు తిప్పుకున్నాడు. పూరి జగన్నాధ్ బద్రి సినిమాతో తనలోని స్టైల్, స్టామీనాను నిరూపించుకున్న పవన్.. ఖుషి సినిమాతో అభిమానుల హృదయాల్లో బంగారం అయ్యాడు. ఖుషి తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గని పవన్ త్రివిక్రమ్ జల్సాతో అలరించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటిది దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మద్యలో తీన్ మార్, పులి సినిమాలు కొంత నిరాశపరిచిన.. కాటమరాయుడు ప్రస్తుతం వకీల్ సాబ్‌గా రాబోతున్నాడు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్టైనా పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Image

Image

Image

Image

ప్రస్తుతం #PawanKalyan #HBDPawanKalyan యాష్ ట్యాగ్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. దీనికి తోడు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు పవన్‌కు సోషల్ మీడియా వేదికగా విషేస్ తెలుపుతున్నారు. ఇక అది అలా ఉంటే.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలిచిన పవన్.. ఓటమి నుంచి ఎన్ని విషయాలు తెలుసుకున్నాన్నని.. వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఎంటో చూపిస్తానని అంటున్నాడు. పవ‌న్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలోనూ అటు రాజకీయాల్లోనూ మంచి విజయాలను పొందాలనీ మనసారా కోరుకుంటోంది.