heroine ester noronha divorce

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్దాలు’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఎస్తర్‌. టాలీవుడ్‌ సింగర్‌, నటుడు నోయల్‌ ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. గత ఏడాది చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అయితే.. ఊహించని విధంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

Also Read: లేడీ కమెడియన్ రహస్య నిశ్చితార్థం ?

https://www.instagram.com/p/CEk_K-Jlaxz/

పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే ఇద్దరి మధ్య సర్దుబాటు సమస్యలు తలెత్తాయని, అలా కొన్ని రోజులకే విడిపోయాం. గతేడాది జూన్‌లోనే మ్యూచువల్‌ డైవర్స్‌కు అప్లైం చేశాం. అధికారికంగా వెల్లడించాలనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లు సైలైంట్‌గా ఉన్నానని ఎస్తేర్‌ తెలిపింది. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో క్లారిటీ ఇస్తున్నట్లు పేర్కొంది. చాలా విషయాల్లో సూటిగా-నిజాయితీగా ఉంటానని, కానీ ఈ విషయంలో మాత్రం ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని పేర్కొంది.