Jabardasth Judge Indraja

Indraja : ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది ఇంద్ర‌జ‌… పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన ఇంద్ర‌జ ‘దిక్కులు చూడకు రామయ్యా’ చిత్రంలో హీరోకి తల్లిగా నటించి.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ కార్యక్ర‌మంతో తెలుగు ప్రేక్ష‌కులని అల‌రిస్తుంది. ఇందులో మ‌నో క‌లిసి జ‌డ్జి సీట్‌లో కూర్చున్న ఇంద్ర‌జ ర‌చ్చ చేస్తుంది. నాగ‌బాబు, రోజా లేని లోటును కొంత వ‌ర‌కు తీరుస్తుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. అయితే ఈ అమ్మ‌డు తాజాగా నెటిజ‌న్స్ సాయం కోరింది.

Indraja Actress Photos Stills Gallery

 

వికీపీడియాలో త‌న‌కు సంబంధించిన వివ‌రాల‌న్నీ త‌ప్పుగా ఉన్నాయ‌ని అంటుంది ఇంద్ర‌జ‌. పుట్టిన తేది, పెళ్లి తేది అన్ని రాంగ్‌గా ఉన్నాయ‌ని, వాటిని చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. అది ఎలా స‌రి చేయించుకోవాలో కాస్త చెప్పండి అంటూ ఇంద్ర‌జ నెటిజ‌న్స్‌ని కోరింది. అయితే ఇంద్ర‌జ రిక్వెస్ట్ కు చాలా మంది త‌మ‌కు తెలిసిన స‌మాచారం అందిచ‌డంతో వారికి థ్యాంక్స్ చెప్పింది. కాగా, ఇంద్ర‌జ 2005లో బిజినెస్ మ్యాన్ అయిన అబ్సర్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Also Read : మునుపెన్నడూ లేనంత బోల్డ్ గా సమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *