Kajal Aggarwal Announces Wedding date

కాజ‌ల్‌.. ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. కొంత కాలంగా వీరిద్ద‌రు ప్రేమించుకుంటున్నార‌ని, పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మయ్యార‌ని స‌మాచారం. క‌ట్ చేస్తే కాజ‌ల్ పెళ్ళికి సంబంధించి ప‌లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ అమ్మ‌డు స్పందిస్తుందా లేదా అని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాజ‌ల్ త‌న పెళ్లి విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

Also Read: భానుశ్రీ ఇలా మారిపోయిందేంటి?

అక్టోబ‌ర్ 30న గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలిపింది. క‌రోనా మ‌హమ్మారి వ‌ల‌న కొద్ది మంది స‌భ్యుల మ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు పేర్కొంది. ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తూ నాపై ప్రేమ‌ను చూపిస్తున్న మీ అంద‌రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని కాజ‌ల్ పేర్కొంది. కాగా, ముంబయిలోని ప్రఖ్యాత ఏడునక్షత్రాల హోటల్‌లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పంచారు. కాగా కాజల్‌ చెల్లి ఇషా అగర్వాల్‌ ఏడేళ్ల కిత్రమే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: టాలీవుడ్ లో మరో యువ న‌టుడు పెళ్లి?