Kajal Aggarwal Getting Married

కాజల్ పెళ్లి వార్త నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. కొందరు మాత్రం అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు కూడా. అయితే కాజల్ చేసిన ఒక్క పోస్ట్ మాత్రం కొందరిలో ఆందోళన, ఇంకొందరిలో ఆసక్తి, మరికొందరిలో సంతోసాన్ని నింపింది.ఓ వైపు పెళ్లి వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతుంటే.. నిన్న సాయంత్రం తీరిగ్గా కాజల్ ఓ పోస్ట్ చేసింది. ఏమీ చెప్పకుండా ఏమీ రాయకుండా కేవలం లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. దీంతో అందరి గుండె బద్దలైనంత పనైంది. కామెంట్లలో అభిమానులు విలావిలా కొట్టుకుంటున్నారు.

Also Read: ప్రభాస్‌తో అనుష్క పెళ్లి… జేజమ్మ ఇంటెలిజెంట్‌ సమాధానం…

Kajal Aggarwal marriage with Aurangabad industrialist? - tollywood

కాజల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూతో ఏడడుగులు వేయనున్నారు. గృహాలంకరణ, టెక్‌ డిజైన్‌ కంపెనీ ‘డిసర్న్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు, సీఈవో ఆయనే. వీళ్లిద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమట! ముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత హిందీ చిత్రసీమ అడ్డా ముంబైలో జరగనున్న తొలి సెలబ్రిటీ వివాహం కాజల్‌దేనని అంటున్నారు. రెండు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఘనంగా ఉంటాయనీ, కుటుంబ సభ్యులు సహా అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారనీ తెలుస్తోంది. పెళ్లి గురించి కాజల్‌ గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ స్పందించలేదు. ఎటువంటి ప్రకటన చేయలేదు. కాజల్‌ లవ్‌ సింబల్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. సినిమాల విషయానికి వస్తే… ‘మోసగాళ్లు’లో విష్ణు మంచుకి సోదరిగా, ‘ఇండియన్‌ 2’లో కమల్‌ హాసన్‌ సరసన, ‘హే సినామిక’లో దుల్కర్‌ సల్మాన్‌ సరసన కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు.