Kajal Aggarwal stunning pics

కాజల్‌ అగర్వాల్‌ గత శుక్రవారం ఎంతో కాలంగా తాను ప్రేమిస్తున్న గౌతమ్‌ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్‌ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ వివాహానికి సంబంధించిన ఫోటోల గురించి చాలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈరోజు మరో రెండు ఫోటోలను కాజల్‌, ఆమె చెల్లి నిషా అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు.

Also Read: పునర్నవి పెళ్లి నాటకం…. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆటలా !

నిషా షేర్‌ చేసిన ఫోటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది. ఇందులో నవదంపతులిద్దరు ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఇక కాజల్‌ షేర్‌ చేసిన ఫోటోలో ఆమె పసుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్‌ మాస్క్‌ పెట్టుకొని ఉంది. గౌతమ్‌కిచ్‌లు వైట్‌ కలర్‌ శర్వాణి ధరించి వైట్ కలర్‌మాస్క్‌ ధరించాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులందరూ కాజల్‌ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *