Karthi Sulthan first look

కార్తి.. ప్రస్తుతం ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కార్తి, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘సుల్తాన్’ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు.

Also Read: కార్తీక దీపం వంటలక్క క్యూట్ ఫోటోస్..

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా అదిరిపోయింది. ఈ స్టిల్ చూస్తుంటే కచ్చితంగా ఇది ఫైట్ సీనేనని అర్థమవుతోంది. మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది. తమిళ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కార్తి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Image

కాగా, కిందటేడాది కార్తి మొత్తం మూడు సినిమాలు చేశారు. వాటిలో ‘దేవ్’, ‘దొంగ’ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. కానీ, ‘ఖైదీ’ మాత్రం కాసుల వర్షం కురిపించింది. అయితే, ‘ఖైదీ’ తరవాత భారీ అంచనాలతో విడుదలైన ‘దొంగ’ పెద్దగా ఆకట్టుకోకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి, ఇప్పుడు ఈ ‘సుల్తాన్’తో మరోసారి కార్తి మెప్పిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *