kgf 2 surprise teaser

KGF2 Teaser : కేజీఎఫ్- 2 నుంచి ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు ముందే చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఆ సాలీడ్ అప్‌డేట్ ప్రేక్షకుల ముందుంచారు. కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1 కు సీక్వల్‌గా ఈ కేజీఎఫ్ ఛాప్టర్‌-2 భారీ రేంజ్‌లో రూపొందుతుండటంతో అన్ని భాషల్లోని ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ డిసెంబర్ 21 సెంటిమెంట్ రిపీట్ చేస్తూ ప్రేక్షకులను హుషారెత్తించే ప్రకటన చేసింది చిత్రయూనిట్.

Image
.

హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తి చేసిన యూనిట్.. తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ”రాఖీ భాయ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నాం” అని ప్రకటించారు. దీంతో కేజీఎఫ్- 2 టీజర్ ఎప్పుడెప్పుడు చూడాలా అని కుతూహలంగా వెయిట్ చేస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు తెరపడింది.కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1 అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించడంతో కేజీఎఫ్- 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ చాప్టర్- 1 లో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ భాయ్‌. ఆ సమయంలో అధీర రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అయితే అతడిని ఎలా అంతమొందిచాడు అనే కథతో ఈ రెండో భాగం రూపొందుతోంది. అధీరగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కనిపించనుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *