madhavi latha

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గురించి ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ లేకుండా టాలీవుడ్ పార్టీలు జరగవంటూ ఆమె సోషల్ మీడియా వేదక ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఫెస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్‌ ను వాడుతారని.. దీనిపై తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టాలంటూ కోరారు. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఎన్‌సీబీ అధికారులు అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని.. అయితే గతంలో లాగా కాకుండా టాలీవుడ్‌పై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.

Also Read: న‌టి మంచు ల‌క్ష్మి రియాకు మ‌ద్దతు

 

గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం పెద్ద రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ కేసు వివరాలు వెల్లడించకుండా అధికారులు మెల్లగా సైలెంట్ కావడంతో అది మిస్టరీ గానే మిగిలింది. మళ్ళీ ఇప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ చూస్తుంటే మరోసారి రచ్చ కావడం ఖాయమే అని తెలుస్తోంది. సో.. చూడాలి మరి మాధవీలత చేసిన ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారనేది.