mahesh babu new look

Image

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బుధవారం తిరిగి షూటింగ్‌ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. చివరగా సారిగా ఆయన `సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ లెక్కన ఆయన షూటింగ్‌ ఆపేసి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది. అయితే తాజాగా యాడ్‌ చిత్రీకరణ ప్యాకప్‌ సమయంలో దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, పెంచిన జుట్టుతో మహేష్‌ లుక్‌ ఉంది. తన నెక్ట్స్ సినిమా లుక్‌ ఇదే అని ప్రచారం ‌ జరుగుతుంది. ఎందుకంటే `సర్కారు వారి పాట` ఫస్ట్ లుక్‌లో మహేష్‌ జుట్టు కాస్త పెద్దగానే కనిపిస్తుంది. దానికి బలం చేకూరేలాగా ఈ లుక్‌ ఉండటం విశేషం.ఇక మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట`కి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తిసురేష్‌నిహీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు టాక్‌.