mass maharaja

మాస్ మహారాజా రవితేజ అనుకోకుండా వస్తాయో ప్లాన్ చేసుకొని సెట్ చేస్తారో తెలియదు గాని టైటిల్స్ మాత్రం చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. రవితేజ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని చాలా వరకు దర్శకులు టైటిల్ విషయంలో కాస్త గట్టిగానే ఆలోచిస్తారు. మాస్ మహరాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘క్రాక్‌’. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్రలో నటిస్తుంది. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రం అన్నీ సజావుగా జరిగితే మే లోనే విడుదలయ్యేది. కరోనాతో అన్ని తారుమారయ్యాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ మొదలు కాబోతున్నట్లుగా చెబుతూ హీరో రవితేజ కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు.

Also Read: సన్నీ కొత్తకారు… ఆ కల తీరిందట

‘మిస్సింగ్ ద సెట్స్‌.. షూట్ స్టార్ట్స్ సూన్‌..’ అంటూ రవితేజ షేర్‌ చేసిన ఫొటోలలో ఆయన లుక్‌ ఎలా ఉందంటే.. అందరూ ఆశ్చర్యపోయేలా ఉంది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో రవితేజ అదరగొడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇడియట్‌ నాటి రవితేజ కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసిన రవితేజ అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారంటే నమ్మాలి మరి. నెటిజన్లు సూపర్ సార్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: బ్లాక్‌ అండ్‌ వైట్‌లో మహేష్ బాబు న్యూ లుక్