Mehreen Kaur

Mehreen Kaur  : మెహరీన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో మెహరీన్‌ వివాహం జరగనుంది. గత కొద్దిరోజులుగా తన వివాహం గురించి మీడియాలో వస్తోన్న వార్తలపై మెహరీన్‌ స్పందించింది. తన పెళ్లి కుదిరిన మాట నిజమేనని, వచ్చే నెల 12న జైపూర్‌ అలీలాకోటలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపింది.

 Mehreen Pirzada

పెద్దలు కుదిర్చిన సంబంధమిదని, జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెహరీన్‌ చెప్పింది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, నోటా, ఎఫ్‌-2 చిత్రాల ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 17 చిత్రాల్లో నాయికగా నటించింది. ప్రస్తుతం మెహరీన్‌ తెలుగులో ‘ఎఫ్‌-2’ సీక్వెల్‌ ‘ఎఫ్‌-3’లో కథానాయికగా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *