nabha natesh about first crush

కన్నడ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న నభ నటేష్‌కు తెలుగులో నన్ను దోచుకొందువంటే చిత్రంతో తెలుగులో అవకాశం లభించింది. ఆ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఇక రెండో చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ తో అయితే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది నభా. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో సోలో బతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్, నితిన్‌తో అంధాదూన్ లాంటి అవకాశాలు చేజిక్కించకొన్నారు.యువ హీరోయిన్ నభ నటేష్ విషయానికి వస్తే.. కేవలం గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా యూత్‌లో గుర్తింపు పొందింది. మాస్ బీట్లకు హుషారుగా వేసే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇలా మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్న ఈ యువ తార తన వన్‌సైడ్ లవ్‌ను బయటపెట్టారు.

Also Read: అంధాధున్ తెలుగు రీమేక్ లో శ్రియ ?

Also Read:సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి డాన్స్ …

తనకు కాలేజ్ డేస్‌లో ఓ సీక్రెట్ లవ్ ఉంది. షారుక్ ఖాన్ అంటే నాకు పిచ్చి ప్రేమ. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రంలో ఆయనను చూసి తొలిసారి నేను ప్రేమలో పడ్డాను అని చెప్పింది.దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం తర్వాత షారుక్ ఖాన్ అంటే చెప్పలేనంత ఇష్టం కలిగింది. కుచ్ కుచ్ హోతా హై లాంటి చిత్రాలను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. కాలేజ్ డేస్‌లో హీరోలపై అలాంటి క్రష్ ఉండటం సహజమే. కానీ బాలీవుడ్ బాద్షా అంటే నాకు ఇప్పటికీ చెప్పలేనంత ఇష్టం అని చెప్పారు.ఇప్పటికైనా నా అభిమాన నటుడితో నటించాలనే కోరిక ఉంది. అవకాశం వస్తే వదులుకోను. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని నభా నటేష్ చెప్పారు.

Also Read: సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్ బాస్ 4 తెలుగు షో