nidhi agarwal

లాక్ డౌన్ కాలంలో సింగిల్ గా ఉన్న తార‌ల్లో కొంత‌మంది రిలేష‌న్ షిప్ మెయింటెయిన్ చేయ‌డమో, పెండ్లి చేసుకోవ‌డ‌మో చేశారు. అయితే తాను మాత్రం ఈ రెండు జాబితాల్లో ఉండ‌నంటోంది ఇస్మార్ట్ భామ నిధిఅగ‌ర్వాల్‌. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో పెద్ద సంఖ్య‌లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది నిధి‌. లాక్ డౌన్ సమ‌యంలో తాను రొమాంటిక్ రిలేష‌న్ షిప్ కోసం చూడ‌లేదని చెప్పింది. అంతేకాదు లాక్ డౌన్ పీరియ‌డ్ త‌న సింగిల్ స్టేట‌స్ ఏం మార్చ‌లేద‌ని చెప్పింది. నిధి ఓ తెలుగు స్టార్ యాక్ట‌ర్ తో డేటింగ్ లో ఉన్న‌ట్టు వ‌చ్చిన వార్త‌లను కొట్టిపారేసింది.

‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల నిధి అగర్వాల్… ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ కొట్టినా ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. అయితే రామ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిధి కెరీర్‌నే మార్చేసింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనలో మరో హీరోయిన్ నభా నటేష్‌తో పోటీ పడి మంచి గుర్తింపు దక్కించుకుంది.

 

ఇక అసలు విషయానికొస్తే.. నిధి అగర్వాల్ కొంతకాలంగా ఓ టాలీవుడ్ హీరోగా ప్రేమలో ఉందని, అతడితో డేటింగ్ కూడా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీని ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. దీంతో కొన్నాళ్లుగా తనపై వస్తున్న రూమర్లకు నిధి చెక్ పెట్టేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *