Niharika marriage

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి సందడి షురూ చేసేసింది మెగా ఫ్యామిలీ. నిహారిక- చైతన్య ఒక్కటి కాబోతున్న ముహూర్తానికి వారం ముందు నుంచే సంబరాలు స్టార్ట్ చేశారు. బుధవారం రాత్రి మెగా కాంపౌండ్ వారసులంతా ఒక్కచోట చేరి నిహారిక, ఆమెకు కాబోయే భర్త చైతన్యకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత సహా మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తెగ సందడి చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: సమంత బికినీ లుక్ పై శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

 

నిహారిక- చైతన్యలతో మెగా వారసులంతా ఫుల్ ఎంజాయ్ చేశారనడానికి ఈ ఫొటోలే సాక్ష్యం. పార్టీలో వరుణ్ తేజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత పాల్గొన్నారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. ”చైనిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఫ్యామిలీ అంతా కలిసి రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసాం” అని పేర్కొన్నారు. కాకపోతే ఈ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించకపోవడంతో కాస్త వెలితిగా ఉందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read: ఫ్లవర్ కాస్ట్యూమ్‌లో అదా శర్మ అందాలు

ఆగస్టు నెలలో నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుక జరిగింది. అప్పటి నుంచే ఈ ఇద్దరి ఫోటోలు, పెళ్లి సంగతులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే చైనిహారిక పెళ్లి డిసెంబర్ 9వ తేదీన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో జరగనుందని నాగబాబు చేసిన ప్రకటనతో సినీ లోకమంతా ఈ శుభ ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *