nishabdam

స్వీటీ అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సంద‌డిచేసేది. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయ‌న్న దానిపై క్లారిటీ లేక‌పోవ‌డంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్‌2న ‘నిశ్శబ్దం’ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయ‌నున్న‌ట్లు నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌క‌టించారు.