Nusrat jahan

Nusrat Jahan : నుస్రత్ జహాన్ పాపులర్ నటి మాత్రమే కాదు ఆమె పార్లమెంటు సభ్యురాలు కూడా. ఈమెకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. నుస్రత్ 6 నెలల గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియా ను ఊపేస్తున్నాయి. కానీ నుస్రత్ ఈ వార్తను ఇంకా ధృవీకరించలేదు. అయినా గర్భం దాల్చటంలో విశేషమేంది అంటారా….. చాలా విశేషమే మరి.

Nusrat Jahan

నుస్రత్ జహాన్ తన ప్రియుడు నిఖిల్ జైన్‌తో జూన్ 19, 2019 న హిందూ మరియు ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ జైన్ గత 6 నెలలుగా నుస్రత్‌ కు దూరంగా ఉంటున్నాడు. వీరిద్దరూ విడాకులు కూడా తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ జైన్ మాట్లాడుతూ.. నుస్రత్ జహాన్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు సంబంధం లేదని పేర్కోనడం వైరల్‌గా మారింది.

గత కొంతకాలంగా నుస్రత్ జహాన్ బిజెపి నాయకుడు. బెంగాలీ నటుడు, యశ్ దాస్‌గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు న్యూ ఇయర్ వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లినట్లు టాక్ కూడ నడిచింది. బెంగాల్ లో ఎవరినోట విన్న ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *