orey bujjiga trailer

రాజ్ తరుణ్‌, మాళవికా నాయర్, హెబ్బా ప‌టేల్‌ నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. కుటుంబ విలువలతో ముడిపడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొంద‌గా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది.

అక్కినేని నాగ చైత‌న్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒరేయ్ బుజ్జిగా చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే చిత్రంలో మ‌న‌ల్ని నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలుస్తుంది .