తాజాగా అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ షూటింగ్‌ కూడా మొదలైంది. ఈ చిత్ర షూటింగ్‌ సెట్స్‌లోకి హీరోయిన్‌ పూజా హెగ్డే అడుగుపెట్టింది. చాలా గ్యాప్ తర్వాత షూటింగ్‌లో అడుగుపెట్టిన పూజా హెగ్డే.. సెట్‌లో ఉన్న తన ఫొటోను సోషల్‌ మీడియాకు రివీల్‌ చేసింది. తన టీమ్‌తో కార్‌వాన్ దగ్గర ఉన్న ఫొటోను షేర్‌ చేసిన పూజా.. ద బాండ్స్ బ్యాక్ టుగెదర్‌ అని తెలిపింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 20 నుంచి అఖిల్‌ అక్కినేని ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రం కాకుండా పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.