Prabhas as Vikramaditya

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ‌కుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు (అక్టోబ‌ర్ 23) కంటే ముందే అభిమానుల‌కు యూవీ క్రియేష‌న్స్ అద్బుత‌మైన కానుక‌నందించింది. ప్ర‌భాస్ కు అడ్వాన్స్ హ్యాపీ బ‌ర్త్ డే విషెస్ చెప్తూ..రాధేశ్యామ్ నుంచి ప్ర‌భాస్ ‘ విక్ర‌మాదిత్య’ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది.

ప్రతి సినిమాకి త‌న హ్యాండ్‌స‌మ్ లుక్, స్టైలిష్ మేకోవ‌ర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసే ప్రభాస్.. ఇప్పుడు ‘రాధే శ్యామ్’లో కూడా అల్ట్రా స్టైలిష్‌గా క‌నిపించ‌బోతున్నారనే విష‌యం ఈ లుక్ చూస్తే అర్థమైపోతుంది. ఇటలీలో ఉన్న గ్రీకు క‌ట్టడాల బ్యాక్ డ్రాప్‌లో వింటేజ్ కార్ మీద బ్లూ బ్లేజ‌ర్ వేసుకుని స్టైలిష్‌గా కుర్చున్న ప్రభాస్ లుక్ అభిమానుల్లో ‘రాధే శ్యామ్’ చిత్రంపై మ‌రింత‌గా అంచ‌నాలు పెంచేలా ఉంది. ఇక ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబ‌లి 2: ది కన్‌క్లూజన్’, ‘సాహో’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో తన క్రేజ్‌ను విశ్వవ్యాప్తం చేసుకున్న ప్రభాస్.. తన 20వ చిత్రమైన ‘రాధే శ్యామ్’ను కె.కె. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శక‌త్వంలో చేస్తోన్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న బుట్ట బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రభాస్ పెదనాన్న డాక్టర్ యు.వి.కృష్ణంరాజు స‌మ‌ర్పిస్తుండగా.. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జ‌స్టిన్ ప్రభాక‌ర‌న్ ‘రాధే శ్యామ్’ తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌లయాళీ వెర్షన్స్‌కి సంగీత‌ దర్శకుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఇట‌లిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్నడ‌ భాషల్లో ‘రాధే శ్యామ్’ను రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *