pragya jaiswal

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటి ప్రగ్యా జైస్వాల్ . ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ హీరోయిన్ గా ఆశించినంతగా అవకాశాలు రాలేదు. పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడితో సినిమా చేస్తోంది అని పలు వార్తలు వచ్చినా.. అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. కానీ సోషల్ మీడియాను మాత్రం హాట్ హాట్ ఫొటోలతో హీటెక్కిస్తోంది.

Also Read: అందంతో క‌ట్టిప‌డేస్తున్న ప్ర‌గ్యాజైశ్వాల్…

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు అందాల విందు ఇస్తోంది. తాజాగా మరో గ్లామరస్ పిక్‌ను ప్రగ్యా షేర్ చేసింది. సాయం సంధ్య సమయంలో బీచ్‌లో టూ పీస్ బికినీలో ఫొటో దిగింది. ఆ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రగ్యా బికినీ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.