Raashi Khanna latest Stills

రాశీ ఖన్నా ప్రయాణం తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంతో మొదలైంది. మొదటి చిత్రంతోనే గ్లామర్ పరంగా, నటనా పరంగా నూటికి నూరు మార్కులు వేయించుకుంది. అక్కడి నుంచి రాశీఖన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితో నటించేసింది.రాశీ ఖన్నా సినిమా హిట్లు ఫట్లు అయ్యాయా? అని ఆలోచించకుండా స్టార్డం పెరుగుతూ వచ్చింది. అయితే తొలిప్రేమ చిత్రంతో రాశీ ఖన్నా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, మెచ్యూర్డ్ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అలా మళ్లీ రాశీ హవా మొదలైంది. ప్రతిరోజూ పండగే, వెంకీమామ చిత్రాలతో మళ్లీ పీక్స్‌కు వెళ్లింది.

అయితే రాశీ ఖన్నా మరీ అంత బోల్డ్‌గా కనిపించే సరికి ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. నిత్యం ఏడుస్తూ ఉండటం లేదా అలాంటీ సీన్లలో కనిపించడంతో ప్రేక్షకులు హర్ట్ అయ్యారు. అయితే ఆ సినిమాతో రాశీ ఖన్నాకు కనువిప్పు కలిగినట్టుంది. ఒకేసరి అలా తనలో ఉన్న గ్లామర్‌ను చూపించేసరికి తట్టుకోలేకపోయారని అర్థం చేసుకున్న రాశీ కొద్దికొద్దిగా అందాలను వడ్డిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *