Rakul Preet Singh

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో విచారణలో భాగంగా డ్రగ్‌ మాఫియా బయటపడింది. సుశాంత్‌కి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్‌ ఇచ్చి మత్తులోకి దించి ఆయన్నుంచి డబ్బులు లాగిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు రకుల్‌ పేరు బయటకు రావడం కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. ఒక్కొక్కటిగా ఆమె రివీల్ చేస్తున్న విషయాలు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వారిలో ఎక్కువగా బాలీవుడ్ అగ్ర హీరో హీరోయిన్లే ఉన్నట్లు తెలిసింది.

<p style="text-align: justify;">ఇక తమిళంలో `అయలాన్‌`, కమల్‌ హాసన్‌ `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. రకుల్‌ చాలా రోజులుగా ముంబయిలోనే ఎక్కువగా గడుపుతుంది. తాజాగా డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడంతో దీని వల్లే తెలుగు సినిమాలు తగ్గించి హిందీ సినిమాలను ఒప్పుకుంటుందని, డ్రగ్స్ కి అలవాటై ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది విచారణలో తేలాలి. </p>

అయితే తాజాగా పలు జాతీయ మీడియాల్లో షికారు చేస్తున్న వార్తల సారాంశం మేరకు డ్రగ్స్ మాఫియాతో మేజర్‌గా డీలింగ్స్ ఉన్న వారిలో బాలీవుడ్ భామలు సారా అలీ ఖాన్‌, సైమోన్ కంబట్టాలతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో వణుకు పుట్టింది. ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి ఈ ముగ్గురి పేర్లు బయటపెట్టిందని సమాచారం.