rashi khanna acts in web series

Rashi Khanna: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. నటనకు నటన, గ్లామర్‌కు గ్లామర్ ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఆమె.. ‘వరల్డ్ ఫేమస్ లవ్’ వంటి ఫ్లాప్ తర్వాత మరో సినిమాను ఓకే చేయలేదు. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా ఓ కీలక నిర్ణయం తీసుకుందని టాక్. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌తో కలిసి రాశీ ఖన్నా ఓ వెబ్‌సిరీస్‌లో సందడి చేయనుంది.

Rashi Khanna Fashion Profile Is Simply A Visual Treat!

రాజ్‌-డి.కె దర్శక ద్వయం యాక్షన్‌ థ్రిల్లర్‌‌ కూడిన కథతో వెబ్‌సిరీస్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే జనవరిలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. షాహిద్‌ కపూర్‌తో పాటు కోలీవుడ్‌కి చెందిన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. రాజ్‌-డి.కె రూపొందిస్తున్న ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’తోనే సమంత కూడా వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకెంత మంది తారలు ఈ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడతారో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *