rashmi gautam marriage

తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది రష్మి గౌతమ్. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అందులో ‘గుంటూరు టాకీస్‌’ మినహా మరే చిత్రము పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లినట్టు చెబుతున్నారు. అంతేకాదు తన తోటి యాంకర్స్ అందరూ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అదే బాటలో తాను కూడా ఎందుకు మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇప్పటికే రష్మి గౌతమ్‌ తనకు కాబోయే వాడిని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే అతనురష్మి గౌతమ్ చెప్పిన అన్ని షరుతులకు ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలోనే రష్మి గౌతమ్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో నటిస్తోంది.