Rashmi new Look In Bomma Blockbuster

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మి గౌతమ్ గురించి సెపేరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పాపులర్ ఈ భామ. యాంకరింగ్ చేస్తూనే.. అడపా దడపా సినిమాలు చేస్తూ అందాలను కనువిందు చేస్తూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.ఆ మధ్య రష్మీ నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు.. తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. ఇక కరోనా లాక్‌డౌన్ నేపపథ్యంలో ఆకలితో అలమటిస్తోన్న జంతువులకు ఇంట్లో వంట వండి పెట్టిన సంగతి తెలసిందే కదా.. దాంతో ఖాళీ సమయాల్లో అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ ఉంది రష్మీ గౌతమ్. ప్రస్తుతం రష్మి జబర్దస్త్ షోతో పాటు హీరో నందుతో కలిసి ఓ సినిమా చేస్తోంది.

Also Read: హీరోగా అఖిల్ క్రేజీ ప్రాజెక్ట్ రెడీ !

 Rashmi Gautam: బొమ్మ బ్లాక్ బస్టర్ లో రష్మీ గౌతమ్ లుక్ అదుర్స్.. Photo : Twitter
ఇక ఈ సినిమాలో పోతురాజుగా కనిపించనున్నాడు నందు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను రివీల్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీ గౌతమ్ నటిస్తుంది. రష్మీ జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. గుంటూర్ టాకీస్ లో ఈ భామ బోల్డ్ పెర్ఫామెన్స్ కి పేరొచ్చింది. పోతురాజు గాడి లవర్ వాణీ అంటూ రష్మీని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక రష్మీ గెటప్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు డ్రామా ఆర్టిస్టులు గా కనిపిస్తారని అర్ధమవుతుంది.

Also Read: డోస్ పెంచిన తెలుగమ్మాయి కల్పిక గణేష్