Renu Desai Mahesh Babu Vadina in Sarkaru Vaari Paata

Renu Desai : సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మహానటి ఫేం కీర్తి సురేష్‌ ఈ సినిమాతో తొలిసారిగా మహేష్‌తో జోడీ కట్టనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ఈనెల ఆఖరులో ప్రారంభం కానుంది. ఇప్పటికే మహేష్‌ అభిమానులు ట్విటర్‌లో సర్కారు వారి పాట అనే హ‍్యష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. కాగా భారీ బడ్జెట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు వదినగా రేణు దేశాయ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం రేణు దేశాయ్‌ని సంప్రదించినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రలో రేణు దేశాయ్‌ కనిపించనున్నట్లు సమాచారం.

Buzz -Renu Desai  As Mahesh Babu Vadina in Sarkaru Vaari Paata - Sakshi

బ్యాంక్ స్కాముల నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్ర కథ సాగనుండటం వల్ల బ్యాంకు వాతావరణంలో ఎక్కువ షూటింగ్ వుండే అవకాశం ఉంది. దాంతో హైదరాబాద్‌, అమెరికాలో ఎక్కవ శాతం షూటింగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకు ఎపిసోడ్లు చిత్రీకరించడానికి రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా సెట్‌ వేసినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ పూర్తి కాగానే ‌ పూరి జగన్నాధ్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్వకత్వంలో మహేష్ నటించనున్నారు.

Also Read: నటి సుమలత పై బయోపిక్‌… ప్రేక్షకులను మెప్పిస్తుందా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *