Evelyn Sharma

Evelyn Sharma : జ‌ర్మ‌న్ మోడ‌ల్ ఎవ‌లిన్ శ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ మ‌ధ్య ప‌రిచ‌యం అయి ఉంటుంది. ప్ర‌భాస్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహోలో ఎవ‌లిన్ నెగెటివ్ షేడ్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఎవ‌లిన్ ‘యే జవానీ హై దివానీ’ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘నూతన్ కీ సాలా’, ‘మై తేరా హీరో’, జ‌బ్ హ్య‌రీ మెట్ సెజ‌ల్‌, హిందీ మీడియం చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది.

Evelyn Sharma

2018లో ఫ్రెండ్స్‌ పార్టీలో ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ తుషాన్‌ భిండిని తొలిసారి క‌లిసింది ఎవ‌లిన్‌. ఆ పార్టీ అయిన ఏడాదికి తుషాన్ నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ మోకాళ్ల మీద కూర్చుని ఎవ‌లిన్‌కు ప్రపోజ్‌ చేశాడు. దీంతో అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చిన వీరి వివాహం గ‌త నెల‌లో సింపుల్‌గా జ‌రిగింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లితంతు పూర్తి కాగా, ఆ పెళ్లి విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది ఎవలిన్. ‘బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం కన్నా సంతోషకరమైనది ఏముంటుంది? వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంద‌ని ఎవ‌లిన్ త‌న పోస్ట్‌లో పేర్కొంది.

Also Read : ఫ్యాన్స్ లో వేడి పెంచేస్తోన్న జాన్వీ కపూర్ అందాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *