sai sudha

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` టీజ‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ర‌మాన్స్ చేసిన సుంద‌రి సాయి సుధ‌. ఇటీవ‌ల శ్యామ్ కె. నాయుడు త‌న‌ని లైంగికంగా వాడుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్ట‌డం, ఆ త‌రువాత రంగంలోకి దిగిన పోలీసులు శ్యామ్ కె. నాయుడిని రిమాండ్‌కు త‌ర‌లించ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌తో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన సాయి సుధ మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. `అల్ల‌రి` ర‌విబాబు వ‌రుస ఫ్లాపుల త‌రువాత ప‌క్కా అడ‌ల్ట్ కంటెంట్‌తో రూపొందిస్తున్న చిత్రం `క్ర‌ష్‌`. ఫ‌స్ట్ పెప్ పేరుతో గురువారం దీనికి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం అడ‌ల్ట్ కంటెంటే. బూతు డైలాగ్‌లే. బూతుని న‌మ్ముకుని యూత్‌ని టార్గెట్ చేస్తూ ర‌విబాబు ఈ మూవీని ర‌పొందించిన‌ట్టు తెలిసిపోయింది.

`క్ర‌ష్‌` కోసం రెచ్చిపోయిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌!

ఈ ఫ‌స్ట్ పెప్‌లో సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది సాయి సుధ‌. స్లీవ్ లెస్ రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్‌లో యెద అందాల్ని క‌నువిందు చేస్తూ సాయి సుధ ర‌చ్చ చేసింది. న‌డుము అందాల్ని చూపిస్తూ కుర్ర‌కారుని హీటెక్కించేసి `క్ర‌ష్ మూవీపై అంచ‌నాల్ని పెంచేసింది. ప్ర‌స్తుతం సాయి సుధ‌కు సంబంధించిన ఫ‌స్ట్ పెప్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నాయి. ఆమెకు సంబంధించిన క్లిప్స్ చూసిన వాళ్లంతా ఈ దెబ్బ‌తో సాయి సుధ పాపుల‌ర్ కావ‌డం గ్యారెంటీ అంటున్నారు.