Samantha Akkineni shares video of all the outfits

Samantha Akkineni:  అక్కినేని వారి కోడలు..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పనే బాగుంది. కేవలం సినిమాలే కాదు..మరోవైపు వెబ్ సిరీస్ లు అంతేనా అంటే కానే కాదు ఆహా కోసం యాంకర్ అవతారం కూడా ఎత్తింది..ఇంకా చెప్పాల్సింది ఉందండోయ్ సమంత గురించి మరో వైపు సామాజిక కార్యక్రమాలతో పాటు యాడ్స్ లలో కూడా అడపాదడపాల మెరుస్తోంది..వీటన్నింటితో పాటు తన సొంత బిజినెస్ లు మరోపక్క..బిజీకి బిజీ డబ్బుకి డబ్బు అలా గడుస్తోంది సమంత కెరీర్ ప్రస్తుతానికైతే. ఓవైపు ఆహా-తెలుగులో సామ్ జామ్ కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూనే.. తదుపరి నటించనున్న సినిమా స్క్రిప్టులపైనా దృష్టి సారించారట.

మరో కోణంలో చూస్తే సామ్ వాణిజ్య ప్రకటనల అవకాశాల్ని విడిచిపెట్టడం లేదు.ఇక సోషల్ మీడియాల్లో సమంతకి ఉన్న అసాధారణ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ వేదికపై సామ్ బ్రాండ్ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ఇన్ స్టాలో ప్రఖ్యాత లూయీస్ వీట్టన్ హ్యాండ్ బ్యాగ్ కి ప్రచారం చేస్తూ కనిపించింది. ఆ ఖరీదైన బ్రాండెడ్ బ్యాగ్ మాటేమో కానీ ఈ లుక్ లో నెవ్వర్ బిఫోర్ హాట్ అప్పియరెన్స్ ఫ్యాన్స్ ని సమంత క్లీన్ బౌల్డ్ చేసేసిందని చెప్పాలి. సామ్ హాట్ కిల్లర్ థై హై లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇలాంటి బ్రాండెడ్ బ్యాగ్ కొనాలంటే మినిమం 2లక్షల రూపాయల నుంచి ఆపై ఎంతైనా పెట్టాల్సి ఉంటుంది మరి. ఇకపోతే బ్యాగ్ కోసం ప్రచారం మాటేమోగాని సమంతని మాత్రం కనార్పకుండా చూడాలనిపించేలా తన అందాలను ఆరబోసింది ఈ యాడ్ కోసం. కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని థైస్ ని చూపెట్టడమే కాదు క్లీవేజ్ షోని కూడా చేయడం విశేషం..అసలు ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తోందా..తనని తాను ప్రమోట్ చేసుకుంటోందా అన్న తీరుగా ఉంది సమంత ఫోజ్ చూస్తుంటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *