Seerat kapoor

క్యాస్టింగ్ కౌచ్ పై సీరత్ కపూర్ కూడా ఎవరు ఊహించని విధంగా స్పందించింది. సీరత్ కపూర్ మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ లేదు చెప్పండి. ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలపై అందరి దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇక్కడే ఎక్కువగా ఉందేమో అనే అనుమానం కలుగుతోంది. కానీ అది నిజం కాదు. ఊరికే వాటిపై ఆరోపణలు చేస్తే లాభం ఉండదు.

Also Read: ప్రగ్యా జైస్వాల్ బికినీ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా!

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదురైనప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అన్నది ముఖ్యం. క్యాస్టింగ్ కౌచ్ జరిగిందని దానిపై ఇష్టం ఉన్నట్లుగా అరిస్తే పెద్దగా లాభం ఉండదు. అలాంటి పరిస్థితులలో మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయం బయటకు చెబితే జనాలకు ఎంతో కొంత జాగ్రత్తలు చెప్పినవాళ్ళం అవుతాము.. అని సీరత్ తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.సీరత్ కపూర్ చెప్పిన విధానంపై సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఆ విధంగా ఆరోపణలు చేసిన వారికి పెద్దగా ఒడిగిందేమి లేదని అనిపిస్తోంది.