shraddha kapoor

సెలబ్రిటీలు తమకు చెందిన వృత్తి, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌‌లలో వీరికి లక్షల్లో ఫాలోవర్స్‌ ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్‌ సెలబ్రిటీలలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల వరకు నాలుగో స్థానంలో ఉన్న ఈ సాహో భామ మరో నటి దీపికా పదుకొనెను వెనక్కునెట్టి మూడో స్థానానికి ఎగబాకింది.

Also Read: సోనూసూద్‌ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

 

ఫోటోలు, వీడియోలు షేరే చేసే ఈ సోషల్‌ మీడియా యాప్‌ను ఇండియాలో కొన్ని మిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినోదం, సామాజిక, ఇతరాత్ర కంటెంట్‌తో తమ సంబంధాలను మెరుగు పురుచుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఇతనిని 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక విరాట్ తరువాత 58.1 మిలియన్ల అభిమానులతో ప్రియాంక చోప్రా జోనాస్ రెండో స్థానంలో​ఉన్నారు. ఇప్పటి వరకు దీపికా పదుకొనె 52.3 మిలియన్లతో మూడో స్థానంలో ఉంటే తాజాదా శ్రద్ధా కపూర్ ఆమెను దాటుకొని 56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది.

Also Read: కాజల్‌ అగర్వాల్‌ ఫ్యాన్స్‌ ఫిదా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *