Shriya to play villian in Andhadhun

శ్రియ టాలీవుడ్ లో అడుగుపెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరని అందం తో ఆకట్టుకొంటుంది. అందుకే అమ్మడు ఇప్పటికీ లీడ్ హీరోయిన్ గానే కొనసాగుతోందని చెప్పాలి. తాజాగా శ్రియ అంధాధున్ తెలుగు రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాయి. ఇక హిందీలో టబు నటంచిన పాత్రలో శ్రయ కనిపించబోతోందట. అంటే అమ్మడి కెరీర్ లో తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించబోతోందన్నమాట.

Also Read: తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి

Also Read: `జెర్సీ` తమిళ రీమేక్ లో త్రిష?

Image Credit: instagram.com/shriya_saran

Image Credit: instagram.com/shriya_saran

Image Credit: instagram.com/shriya_saran

తొలుత తెలుగులోనూ టబునే విలన్ గా కొనసాగించాలని అనుకున్నారు. కానీ, అది వర్కౌట్ అవ్వకపోవడంతో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారు. ఈ పాత్రకోసం అమ్మడు అక్షరాలా 9కోట్లు డిమాండ్ చేయడంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగివచ్చిన టీమ్, చివరకు శ్రియను ఓకే చేసుకున్నారు. మరి కెరీర్ లోనే విభిన్నమైన పాత్ర పోషించబోతున్న శ్రియ టబు ఏమేరకు మరిపిస్తుందో చూడాలి.