sp balasubrahmanyam

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం‌కు కరోనా సోకడంతో గత నెల 5వ తేదిన చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కరోనా పోరాడుతూ కాసేపటి క్రితమే మధ్యాహ్నం 01గం.04 నిమిషాలకు తుది శ్వాస విడిశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత 52 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. మధ్యలో ఆయన కోలుకున్నట్టు వార్తలు వచ్చినా.. ప్రాణాలు నిలవలేదు. బాలు సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చిత్రసీమకు ఎనలేని సేవలందించారు.

Image

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన నటులు అల్లు రామలింగయ్య, కమల్ హాసన్. ఎస్బీ బాలు కమల్ హాసన్ ను తమ్ముడు అని పిలుస్తారు.

Image

బాలుకు స్వీట్లు అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా మిల్క్ స్వీట్లు.. పాలకోవా కనిపిస్తే ఆబగా లాగించావరట. టెన్నిస్, క్రికెట్ అంటే బాలుకు ఇష్టం.

Image

చిన్నప్పుడు బాలుకు ఆయన తల్లి ఆడపిల్లల దుస్తులు వేసింది. తనకు అడపిల్ల పుట్టలేదని చెప్పి అలా దుస్తులు వేసి ముచ్చట తీర్చుకునేదట.

Image

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ద్వంద్వార్థాల పాటల పాడడానికి నిరాకరిస్తూ వచ్చారు.కసి కసిగా ఉంది, చల్లగాలి వీస్తోంది, బలం పట్టి.. వంటి పాటలు పాడిన బాలు ఆ తర్వాత ద్వంద్వార్థాలు ఉండే పాటలు పాడడం మానేశారు.